Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు
భువనగిరిరూరల్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు అమ్మడం సరికాదని, వెంటనే ప్రైవేటీకరణను నిలిపివేయాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు డిమాండ్ చేశారు. మంగళవారం మండలంలోని అనాజిపురం గ్రామంలో జీఎన్పీ గార్డెన్ లో ఏదునూరి ఇస్తారి ప్రాంగణంలో ,జూపల్లి రాధనగర్లో నిర్వహించిన ఆ పార్టీ మండల ఏడో మహాసభలో ఆయన మాట్లాడారు. దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతున్న సమయంలో కంట్రోల్ చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలలో ఎన్నికలు జరపడంతో దేశవ్యాప్తంగా కరోనా వ్యాపించింద న్నారు. ఆ సమయంలో ప్రజలు ఆక్సిజన్ అందక ,బెడ్లు దొరకక తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. చివరి అంతిమయాత్రకు కనీసం శ్మశాన వాటికలో స్థలం కూడా దొరకని అత్యంత దయనీయమైన పరిస్థితి ఏర్పడిందన్నారు. మోడీ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలతో దేశ ప్రజలు విసుగుచెంది, ప్రత్యక్షంగా రోడ్ల మీదికి వచ్చి పోరాటాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చి దేశీయ వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు అప్పజెప్పే కుట్రలు చేస్తుందని విమర్శించారు. లేబర్ కోడ్ బిల్లుతో కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తూ, విద్యుత్ సంస్కరణల చట్టంతో రాష్ట్రాల హక్కులు కేంద్రం కాలరాసే ప్రయత్నం చేస్తోందన్నారు. పెట్రోల్ డీజిల్ గ్యాస్ నిత్యావసర సరుకులు ఊహించని స్థాయిలో పెరిగి సామాన్యుల జీవితాల్ని అందంకారంగా తయారయ్యే అన్నారు. నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చి విద్యను కార్పొరేట్లకు అప్పజెప్పే ప్రయత్నం చేస్తూ మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నారని విమర్శించారు. దేశ ప్రజలు అందరూ సంఘటితమై, ప్రజా వ్యతిరేక విధానాలపై, మతోన్మాదంపై పోరాడాలని పిలుపునిచ్చారు. ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎండి. జహంగీర్్ మాట్లాడుతూ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చినా ఎన్నికలలో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. దళితులకు మూడెకరాల భూమి, 57ఏండ్ల వారికి పింఛన్, నిరు పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అందజేయడంలో, ఉద్యోగావకాశాలు కల్పించడంలో విఫలమైందన్నారు. రాష్ట్రంలో 27 మంది నిరుద్యోగులు ప్రాణాలు కోల్పోయారన్నారు. కేంద్రం తీసుకొస్తున్న అనేక ప్రజావ్యతిరేక విధానాలను ప్రతిఘటించకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంటుందో సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. హెచ్ఎండీఏ పరిధి నుండి భువనగిరి మండలం తొలగించాలని కోరారు. అంతకుముందు జిట్ట అంజి రెడ్డి జెండాను ఆవిష్కరించారు. అమరుల చిత్రపటాలకు శ్రద్ధాంజలి ఘటించారు. గునుగుంట్ల శ్రీనివాస్, కొండమడుగు నాగమణి అధ్యక్షతన నిర్వహించిన ఈ మహాసభలో ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరి బాలరాజు, సీనియర్ నాయకులు గూడూరు అంజిరెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు దాసరి పాండు, మండల కార్యదర్శి దయ్యాల నరసింహ, ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షురాలు గునుగుంట్ల కల్పన, గ్రామ శాఖ కార్యదర్శి అబ్దుల్లాపురం వెంకటేష్, మండల కమిటీ సభ్యులు పల్లెర్ల అంజయ్య, సిలివేరు ఎల్లయ్య, పాండాల మైసయ్య, రాసాల వెంకటేష్, అన్నంపట్ల కష్ణ, మోటే ఎల్లయ్య, కొండ అశోక్, నాయకులు బొల్లేపల్లి కుమార్, ఏదునూరి వెంకటేష్, బిక్షపతి బాలయ్య, కడారి రాజమల్లు, కడారి కష్ణ, ఎండి. జహంగీర్, ఎండి.నజీమా పాల్గొన్నారు.