Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షులు కొలుపుల వివేకానంద
నవతెలంగాణ- ఆలేరుటౌన్
ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ జర్నలిస్టుల సమస్యల పరిష్కా రం కోసం కలిసికట్ట్టుగా పని చేద్దామని టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షులు కొలుపుల వివేకా నంద అన్నారు. మంగళవారం స్థానిక రహదారిబంగ్లా వద్ద ఆ యూనియన్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నియోజకవర్గ నాయకులు యేలుగల కుమారస్వామి అధ్యక్షతన నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారం టీడబ్ల్యూజేఎఫ్ పనిచేస్తుందన్నారు. జిల్లా కమిటీ కషి కారణంగా గతంలో జిల్లా కేంద్రంలోని సింగన్నగూడెం ,మాస్కుంట వద్ద వర్కింగ్ జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇప్పించామన్నారు. జర్నలిస్టుల పిల్లల చదువుల కోసం పాఠశాలలు,కళాశాలల్లో 50 శాతం ఫీజు రీయంబర్స్మెంట్ ఉండేలా చూస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో ఆ యూనియన్్ జిల్లా ఉపాధ్యక్షులు దాసి శంకర్, ముత్యాల జలేందర్ , మండల నాయకులు ములకల రవి, హన్మకొండ ఉపేంద్రాచారి, సిరిగిరి స్వామి, గంగాధరి శ్రావణ్ ,ఎర్రగొల్ల పాండు ,జర్నలిస్టులు పాల్గొన్నారు.