Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నకిరేకల్
బహిరంగ వేలం లేకుండా తమ దుకాణాలను తమకే కిరాయికి కేటాయించాలని డిమాండ్ చేస్తూ కరోడ్ గిరినాక దుకాణ బాధితులు మంగళవారం కాంప్లెక్స్ ముందు రిలే నిరాహార దీక్షలను ప్రారంభించారు.దీక్షలకు టీపీసీసీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దైద రవీందర్ మద్దతు తెలిపి మాట్లాడారు.నాడు స్వంత ఖర్చుతో నిర్మించుకున్న దుకాణాలకు బహిరంగ వేలం పెట్టి వారికి అన్యాయం చేయడం తగదన్నారు.నాడు దుకాణదారులు నిర్మాణం కోసం పెట్టిన ఖర్చుతో నాలుగైదు గుంటల ఖాళీ స్థలం వచ్చేదన్నారు.ప్రస్తుతం దుకాణాలు లేక దుకాణదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉందన్నారు.ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు ఆలోచించి పాత వారికే దుకాణాలను కేటాయించి కిరాయిలు నిర్ణయించాలని డిమాండ్ చేశారు. సంఘీభావం తెలిపిన వారిలో కాంగ్రెస్ జిల్లా నాయకులు గార్లపాటి రవీందర్రెడ్డి, ఎండి.యూసుఫ్, దుకాణదారులు చంద్రగిరిశ్రీనివాస్, వంటెపాక మైసయ్య, దోమలపల్లి ఉమేందర్, సింగం ఇస్తారి, గడ్డం చంద్రయ్య, గడ్డం సైదులు, మహ్మద్ ఆరీఫ్, ఏశబోయిన యాదగిరి పాల్గొన్నారు.