Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వినాయక విగ్రహం మీద పడి ఒకరి మృతి
నవతెలంగాణ-నాగారం
వినాయక విగ్రహం మీద పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని డి.కొత్తపల్లి గ్రామంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం...స్థానిక బీసీ కాలనీలో ఉన్న వినాయకుని విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు ట్రాక్టర్లో తరలిస్తున్నారు. అదే గ్రామానికి చెందిన తోడుసు వెంకన్న, కాసం రాములు ట్రాక్టర్లో వెనుక వైపు నిలబడి భక్తులకు ప్రసాదం పంచుతున్నారు. ఈ క్రమంలో కేబుల్ వైరు తగిలి వినాయకుని విగ్రహం వెంకన్నపై పడింది. ఈ ప్రమాదంలో వెంకన్నకు తీవ్ర గాయాలయ్యాయి. ఆయన్ను చికిత్స నిమిత్తం సూర్యాపేట ఏరియాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై హరికృష్ణ తెలిపారు.