Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఐసీడీఎస్ పీడీ జ్యోతిపద్మ
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్
జిల్లాలో వయోవృద్ధుల సంక్షేమం, తల్లిదండ్రుల పోషణకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ప్రత్యేక కృషి చేస్తున్నట్టు ఐసీడీఎస్ పీడీ జ్యోతి పద్మ అన్నారు. అక్టోబర్ ఒకటిన నిర్వహించనున్న అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవాన్ని పురస్కరిం చుకుని మంగళవారం స్థానిక ఐసీడీఎస్ కార్యాలయంలో నిర్వహి ంచిన సమావేశంలో ఆమె మాట్లా డారు. జిల్లాలో వయో వృద్ధులకు ప్రాధాన్యత కల్పిస్తున్నట్టు చెప్పారు. అదే విధంగా తల్లిదండ్రుల పోషణ చట్టం, వయో వృద్ధుల మాన, ప్రాణ, అరోగ్య, ఆస్తి సంరక్షణకు గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో సిటిజన్ ట్రిబ్యునల్ ద్వారా సమస్యల పరిష్కారానికి కమిటీల ఏర్పాటుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు బి.రాంబాబు, ఆర్.సీతరామయ్య, కార్యదర్శి ఎస్ఏ.హమీద్‌ఖాన్, ఏ.విక్టర్ బాబు తదితరులు పాల్గొన్నారు.