Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డీఐజీ రంగనాథ్
నవతెలంగాణ-నల్లగొండిపాంతీయప్రతినిధి
గంజాయితో తయారు చేస్తున్న విడాయిల్ విక్రయిస్తున్న ముఠాను నల్లగొండ వన్‌టౌన్ పోలీసులు అరెస్టు చేశారని డీఐజీ రంగనాథ్ తెలిపారు.మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో అరెస్టుకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు.వైజాగ్ అరకు ప్రాంతానికి చెందిన కిల్లో సురేష్, హైదరాబాద్‌కు చెందిన షేక్ మహిబూబ్అలీ పట్టణంలోని వన్‌టౌన్ ప్రాంతంలో విడాయిల్ విక్రయించేందుకు వచ్చారన్న విశ్వసనీయ సమాచారం పోలీసులకు అందింది.దీంతో వన్‌టౌన్ పోలీసులు సీఐ బాలగోపాల్ నేతృత్వంలో దాడులు నిర్వహించి వారిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో విడాయిల్ కిలో రూ.40 వేలకు కొనుగోలు 100 డబ్బాలను తయారు చేసి వివిధ ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్టు నేరం అంగీకరించారు.లీటర్ విక్రయం ద్వారా రూ.3 లక్షలు సంపాదించే ఆలోచనతో హైదరాబాద్ నుండి నల్లగొండ యాక్టివా వాహనంపై వచ్చినట్టు తేలింది.వీరి నుండి పోలీసులు యాక్టివ వాహనంతో పాటు రెండు మోబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.సుమారు 20 కిలోల గంజాయికి లీటర్ విడాయిల్ వస్తుంది.రెండు చుక్కల విడాయిల్ వేసుకుంటే అధికంగా కిక్కు వస్తుంది.గంజాయి రవాణా కన్నా విడాయిల్ రవాణా సులభంగా ఉండడంతో దీని విక్రయాలకు పాల్పడుతున్నారు. వీరిద్దర్ని అరెస్టు చేసిన డీటీసీ ఎస్పీ సతీష్చోడగిరి, నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి, వన్‌టౌన్ సీఐ బాలగోపాల్, టాస్క్‌ఫోర్స్ సీఐ రౌతుగోపి, ఐటీ సెల్ సిబ్బంది మధును ఆయన అభినందించారు.
అనుమతి లేకుండా పెయిన్ కిల్లర్స్ విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు
వైద్యుల ప్రిస్క్రిప్షన్ ద్వారా మాత్రమే విక్రయించాల్సిన హైడోస్ పెయిన్‌కిల్లర్స్ విక్రయిస్తూ పలువుర్ని ఆ మందులకు బానిసలుగా చేస్తున్న మెడికల్ షాప్ నిర్వాహకుడు, మరో వ్యక్తిని అరెస్టు చేశామని డీఐజీ రంగనాథ్ తెలిపారు.నల్లగొండ పట్టణంలోని కాపురాల గుట్ట వద్ద కొంతమంది యువకులు గంజాయి సేవిస్తున్నారనే సమాచారం రావడంతో మంగళవారం వన్‌టౌన్ సీఐ బాలగోపాల్ అక్కడకు వెళ్లి తనిఖీ చేయగా ఎండిగౌస్ మత్తుతో తూలుతూ కనిపించడంతో పాటు అక్కడ కొన్ని టాబ్లెట్ల కవర్లు లభించడంతో వాటిని స్వాధీనం చేసుకొని అతడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో చాలాకాలంగా గంజాయి సేవిస్తున్నానని, ఇటీవల గంజాయి సరిగా దొరకకపోవడంతో ఈ హైడోస్ కలిగిన ూజూaరఎశీ - ూతీశీఞyఙశీఅ ూశ్రీబర టాబెట్లను తీసుకుంటున్నట్టు చెప్పడంతో విచారణ చేపట్టాన్నారు.ఈ క్రమంలోనే నల్లగొండ పట్టణం ప్రకాశంబజార్‌లోని రాజా మెడికల్ హాల్ నిర్వాహకుడు దుస్సా జనార్దన్ డాక్టర్ల అనుమతి, ప్రిస్కిప్షన్ ద్వారా విక్రయించాల్సిన ూజూaరఎశీ - ూతీశీఞyఙశీఅ ూశ్రీబర టాబ్లెట్లను ప్రిస్కిప్సన్ లేకుండా విక్రయిస్తున్నట్టు తెలిపారు. హైడోస్ కలిగిన ఈ పెయిన్‌కిల్లర్స్‌ను నల్లగొండ పట్టణంలోని శాంతినగర్ ప్రాంతానికి చెందిన గౌస్‌తో పాటు మరి కొంత మందికి విక్రయించినట్టు విచారణలో వెల్లడైంది.ఎక్కడ ఈ టాబెట్లను కొనుగోలు చేస్తున్నారనే కోణంలో విచారించగా రాజా మెడికల్‌హాల్‌లో కొనుగోలు చేసినట్టు తేలింది. హైడోస్ కలిగిన పెయిన్ కిల్లర్స్ విక్రయి ంచిన వారిని టాబెట్లకు బానిసలుగా మార్చడమే కాక వారి భవిష్యత్‌ను నాశనం చేస్తున్నాడు.టాబెట్లకు బానిసగా మారి వీటిని మానేయడం ద్వారా మరో యువకుడు ఇప్పటికే హైదరాబాద్ పిచ్చాస్పత్రిలో మానసిక రోగిగా మారాడు.ఈ టాబెట్లకు అలవాటు పడి బానిసగా మారిన అమీర్్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.ఎండి.గౌస్‌తో పాటు మెడికల్ షాప్ నిర్వాహకుడు జనార్దన్‌ను నల్లగొండ వన్‌టౌన్ పోలీసులు అరెస్టు చేసి అతని వద్ద నుండి భారీ డోస్ కలిగిన రెండు షీట్ల (16) ూజూaరఎశీ - ూతీశీఞyఙశీఅ ూశ్రీబర టాబ్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.ఈ కేసు పర్యవేక్షించిన డీటీసీ ఎస్పీ సతీష్ చోడగిరి, సమర్ధవంతంగా పని చేసిన నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి, వన్‌టౌన్ సీఐ బాలగోపాల్, టాస్క్‌ఫోర్స్ సీఐ రౌతుగోపి సిబ్బందిని ఎస్పీ అభినందించారు.