Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రౌండ్ టేబుల్ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-మిర్యాలగూడ
రైతు, కార్మిక వ్యతిరేక చట్టాలకు నిరసనగా రైతు ఉద్యమానికి మద్దతుగా 27న జరిగే భారత్ బంద్‌ను జయప్రదం చేయాలని మాజీ ఎమ్మెల్యే, రైతుసంఘం రాష్ట్ర నాయకులు జూలకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు.మంగళవారం స్థానిక సీపీఐ(ఎం) కార్యాలయంలో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహిం చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 19 వామపక్ష పార్టీలు ప్రతిపక్ష పార్టీల మద్దతుతో ఈ బంద్ చేపడుతున్నామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోసపూరిత మాటలతో ప్రజలపై భారాలు మోపుతున్నాయన్నారు. రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చి ప్రజా సంపదను కొల్లగొడుతున్నారని విమర్శించారు.కార్పొరేట్‌శక్తులకు మోడీ ఏజెంట్‌గా మారి ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్నారన్నారు.అన్ని వర్గాల ప్రజలు చైతన్యవంతులై ప్రజావ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని, దీని కోసం 27న జరిగే బంద్‌లో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.వ్యాపార, వాణిజ్య, రవాణా సంస్థలు సంపూర్ణబంద్కు సహకరించాలని కోరారు.బంద్ విజయవంతం కోసం ఈ నెల 25న బైక్ ర్యాలీ నిర్వహించనున్నట్టు తెలిపారు. దీనికి పెద్దఎత్తున జన సమీకరణ చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర నాయకులు బంటు వెంకటేశ్వర్లు, సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు డబ్బికార్ మల్లేష్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, మట్టిమనిషి వేనేపల్లి వెంకటేశ్వర్లు, ఎంసీపీఐ నాయకులు వస్కులమట్టయ్య, సీఐటీయూ జిల్లా నాయకులు డాక్టర్ మల్లు గౌతమ్‌రెడ్డి, గిరిజనసంఘం నాయకులు రవినాయక్, వేములపల్లి వైస్‌ఎంపీపీ పాదూరి గోవర్థన, భావండ్ల పాండు, పరుశరాములు, లింగానాయక్, న్యూ డెమోక్రసీ నాయకులు జ్వాల వెంకటేశ్వర్లు, రైతు సంఘం నాయకులు మంగారెడ్డి, రాంరెడ్డి, ఎర్రానాయక్, ఎమ్మార్పీఎస్ నాయకులు తలకొప్పుల సైదులు, జేవీవీ నాయకులు రమణారెడ్డి, రామ్మూర్తి, ఐద్వా నాయకులు ఊర్మిళ, వరలక్ష్మీ, దేశీరాంనాయక్, గుణగంటి రాంచంద్రు పాల్గొన్నారు.