Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -నార్కట్పల్లి
గర్భిణులు ,బాలింతలు, కిశోర బాలికలు ప్రతిరోజూ తీసుకునే పౌష్టిక ఆహారంతోనే ఆరోగ్యం లభిస్తుందని ఐసీడీఎస్ నకిరేకల్ ప్రాజెక్ట్ సీడీపీఓ డి. రత్తమ్మ పేర్కొన్నారు . గురువారం మండలకేంద్రంలో నార్కట్ పల్లి, అక్కినపల్లి , సెక్టార్ పరిధిలో మండల స్థాయి పోషణ అభియాన్ అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవడం వలన ఆరోగ్యవంతులుగా ఉంటారని చెప్పారు. ఎంపీపీ సూ ది రెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గర్భిణీలు, బాలింతలు కిశోర బాలికలకు చిన్నారుల కు సైతం అనేక పథకాలను ప్రవేశపెట్టి ప్రోత్సహిస్తుందన్నారు. అనంతరం గర్భిణులకు సామూహిక శ్రీమంతాలు, చిన్నారులకు అన్నప్రాసన, సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సాంబశివరావు, సూపర్వైజర్లు మాదాసు కళావతి , ఫరీదా బేగం, సునీత, జ్యోతి పోషన్ అభియాన్ బ్లాక్ కోఆర్డినేటర్ ప్రేమ్ సాగర్, టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు, బైరెడ్డి కర్ణాకర్ రెడ్డి, చిన్న నారాయణపురం సర్పంచ్ కొత్త నరసింహ, కర్ణాటి ఉపేందర్ , అంగన్వాడి టీచర్లు వేముల లక్ష్మి, ఉమాదేవి, సామ సునీత, మౌనిక సునీత కరుణ ప్రభావతి, మహాలక్ష్మి, నూనె యాదమ్మ, కళ్యాణి కవిత మహేశ్వరి, సౌజన్య తదితరులు పాల్గొన్నారు.