Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ వైద్య సేవలు అందించేది ఎవరు సార్..?
అ వైద్యాధికారుల విధి నిర్వహణ పై అసంతృప్తి వ్యక్తం చేసిన ప్రజా ప్రతినిధులు
అ విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే ఎంతటి వారినైనా సహించేది లేదు : డీటీసీవో
నవతెలంగాణ- మునుగోడు
వైద్యాధికారులు ఉదయం 10 గంటల తర్వాత వచ్చి ఒంటిగంటలోపు ఇంటికి వెళ్లి పోతే వైద్య సేవలు అందించేది ఎవరు సార్..? అని మండల అధికారులు , ప్రజా ప్రతినిధులు డీటీసీవోను ప్రశ్నించారు. గురువారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎంపీపీ కర్నాటి స్వామి యాదవ్ అధ్యక్షతన నిర్వహించిన ఆరోగ్య కేంద్రం అభివృద్ధి కమిటీ విస్తృతస్థాయి సమావేశంలో సంబంధిత డీటీసీవో కళ్యాణ చక్రవర్తిని ప్రజాప్రతినిధులు ప్రశ్నించడంతో సమాధానం కరువైంది. ఈ సందర్భంగా కళ్యాణ చక్రవర్తి మాట్లాడుతూ విధి నిర్వహణలో సమయపాలన పాటించకుంటే సహించేది లేదని సంబంధిత మండల వైద్య అధికారులను , సిబ్బందిని హెచ్చరించారు . సమయపాలన పాటించడం లేదని ఆరోపణలు పునరావృతం కాకుండా పర్యవేక్షించాల్సిన మండల వైద్యాధికారుల నిర్లక్ష్యం కారణంగా వైద్య సేవలపై ప్రజలు నమ్మకం కోల్పోతారని మండిపడ్డారు. మరోమారు సమయపాలన , వైద్య సేవలలో నిర్లక్ష్యం వహిస్తున్నట్లు తమ దృష్టికి వస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం తహసీల్దార్ జక్కర్తి శ్రీనివాసులు , ఎంపీడీవోయాకూబ్ నాయక్ మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండేందుకు ఎప్పటికప్పుడు ప్రజాప్రతినిధులకు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. వైద్య కేంద్రం లో నాణ్యమైన సేవలను అందించాలని సూచించారు. ఆస్పత్రి ఆవరణంలో మొలచిన పిచ్చి మొక్కలను గడ్డిని నెలకోసారి గ్రామ పంచాయతీ సిబ్బంది తో తొలగించాలని స్థానిక సర్పంచ్‌ను కోరారు. ఆరోగ్య కేంద్రంలోకి పశువులు , పందులు సంచరించకుండా ఆసుపత్రి అంతర్భాగంలో పెన్సింగ్ ను ఏర్పాటు చేపట్టేందుకు తీర్మానం చేశారు. ఆసుపత్రికి వచ్చిన రోగులకు సేదతీరేందుకు కూర్చు లు లేవని మండల వైద్యాధికారి లహరి తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన తహసీల్దార్ జక్కర్తి శ్రీనివాసులు, పీఏసీఎస్ చైర్మెన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి 45 కుర్చీలను ,యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మందుల సైదులు సిమెంట్ కుర్చీలను అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలోజెడ్పీటీసీ నారబోయిన స్వరూపారాణి రవి ముదిరాజ్ , ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ సత్య నరేష్, హెల్త్ అసిస్టెంట్ శంకర్, సర్పంచులు మిర్యాల వెంకటేశ్వర్లు, కంచి జ్యోతి ప్రసాద్, తాటికొండ సంతోష సైదులు, ఎంపీటీసీ సభ్యులు బొడ్డు శ్రావణి నాగరాజు గౌడ్, నిర్మల శరత్ బాబు పాల్గొన్నారు.