Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -నకిరేకల్
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను వ్యతిరేకిస్తూ ఈనెల 27న నిర్వహించే భారత్ బంద్‌ను విజయవంతం చేయాలని అఖిలపక్ష నాయకులు కోరారు. గురువారం స్థానిక నర్రా రాఘవరెడ్డి భవనంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు బొజ్జ చిన్న వెంకులు అధ్యక్షతన అఖిల పక్షాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిల పక్ష నాయకులు మాట్లాడారు. కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందాల ప్రమీల, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు దైద రవీందర్, సీపీిఐ న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు రాయి కష్ణ, ఎం సీపీఐ నాయకులు గాజుల శ్రీనివాసులు,బీఎస్పీ నాయకులు కాన్షీరామ్, జిల్లా రైతు సంఘం ఉపాధ్యక్షులు యానాల కష్ణా రెడ్డి, కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు రాచకొండ వెంకట్ గౌడ్, మరి వెంకటయ్య, సీఐటీయూ నాయకులు వెంకటేశ్వర్లు, సీపీఐ(ఎం) టౌన్ కార్యదర్శ సా కుంట నరసింహ, మహిళా సంఘం నాయకులు నాగమణి, ఇందిరా పాల్గొన్నారు