Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మెన్ రామకష్ణారెడ్డి
నవతెలంగాణ-చౌటుప్పల్
రానున్న ఎన్నికల్లో మునుగోడు నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మెన్ కంచర్ల రామకష్ణారెడ్డి అన్నారు. గురువారం చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని జయశ్రీ ఫంక్షన్హాల్లో టీఆర్ఎస్ మున్సిపాలిటీ నూతనకమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయాలన్నారు. వచ్చే ఎన్నికల్లో మునుగోడులో టీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో గెలిచే విధంగా పార్టీ కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలన్నారు. పార్టీకి పట్టుగొమ్మలు కార్యకర్తలేనన్నారు. పార్టీ నాయకత్వానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. కార్యకర్తలు ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించాలని సూచించారు. అనంతరం మున్సిపాలిటీ నూతన కమిటీని ఎన్నుకున్నారు.ఎన్నికైన వారిని అభినందించారు. ఈ సమావేశంలో ఎంపీపీ తాడూరి వెంకట్‌రెడ్డి, మున్సిపల్ చైర్మెన్ వెన్‌రెడ్డి రాజు, సింగిల్విండోచైర్మెన్ చింతల దామోదర్‌రెడ్డి, వ్యవసాయ మార్కెట్ చైర్మెన్ బొడ్డు శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు గిరికటి నిరంజన్‌గౌడ్, సింగిల్‌విండో వైస్ చైర్మెన్ చెన్నగోని అంజయ్యగౌడ్, గ్రంథాలయ చైర్మెన్ ఉడుగు మల్లేశ్‌గౌడ్, నాయకులు ఉడుగు శ్రీనివాస్‌గౌడ్, పెద్దిటి బుచ్చిరెడ్డి, ముత్యాల భూపాల్‌రెడ్డి, చిరందాసు ధనుంజయ, పిల్లలమర్రి శ్రీనివాస్, బొంగు జంగయ్యగౌడ్, సిద్దిపేట శేఖర్‌రెడ్డి, గుండు మల్లయ్యగౌడ్, తొర్పునూరి మల్లేశ్‌గౌడ్, బొమ్మిరెడ్డి వెంకట్‌రెడ్డి, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
టీఆర్ఎస్ మున్సిపాలిటీ అధ్యక్షునిగా ప్రభాకర్‌రెడ్)
ప్రధానకార్యదర్శిగా వెంకటేశ్‌యాదవ్
్ట మున్సిపాలిటీ నూతనకమిటీని మునుగోడు ఎన్నికల ఇన్చార్జి కంచర్ల రామకష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. పట్టణానికి చెందిన ముత్యాల ప్రభాకర్‌రెడ్డిని మున్సిపాలిటీ అధ్యక్షునిగా, లక్కారం గ్రామానికి చెందిన గుండెబోయిన వెంకటేశ్ యాదవ్‌ను ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు. ప్రభాకర్‌రెడ్డి, వెంకటేశ్‌యాదవ్ మాట్లాడుతూ తమపై ఉన్న నమ్మకంతో పదవులు ఇచ్చినందున పార్టీ బలోపేతం కోసం శాయశక్తులా కష్టపడి పనిచేస్తామన్నారు. కార్యకర్తలతో ఐక్యంగా ఉండి వారి కష్టసుఖాల్లో పాలుపంచు కుంటామన్నారు. తమ నియమకానికి సహకరించిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు అందరికి కతజ్ఞతలు తెలిపారు. నూతనకమిటీని కార్యకర్తలు పెద్ద ఎత్తున పూలమాలలు, శాలువాలతో సన్మానించారు.