Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ పది మంది ప్రయాణికులకు గాయాలు
అ బస్సు క్యాబిన్లో ఇరుక్కు పోయిన డ్రైవర్
అ క్షతగాత్రులను చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
అ జాతీయ రహదారి-65పై రెండు కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ జామ్
నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్
ప్రైవేట్ బస్సును టిప్పర్లారీ ఢికొట్టిగా 10మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన గురువారం తెల్లవారుజామున యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం లక్కారం గ్రామంలో జాతీయరహదారి-65పై చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఆరెంజ్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఏలూరు నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్నది. హైదరాబాద్ వైపు నుండి చౌటుప్పల్ వస్తున్న టిప్పర్ లారీ డీివైడర్ను దాటుకుని ఎదురుగా వస్తున్న బస్సును ఢ కొట్టింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న పది మందికి గాయాలయ్యాయి. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన బస్సు డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కు పోయాడు.నల్లగొండ జిల్లా చిట్యాల మండలం ఏపూర్ గ్రామానికి చెందిన టిప్పర్ డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన క్షతగాత్రులను చికిత్స నిమ్మిత్తం చౌటుప్పల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం డ్రైవర్ ను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించారు. ప్రమాదం జరగడంతో జాతీయ రహదారిపై రెండు కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ జామ్ అయ్యింది.
టిప్పర్ డ్రైవర్ అతివేగమా..? లేక నిద్ర మత్తా..?
జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో టిప్పర్ డ్రైవర్ అతివేగమే కారణమా?లేక నిద్ర మత్తే కారణమా అంటూ స్థానికులు చర్చించుకుంటున్నారు. తెల్లవారుజాము కావడంతో నిద్ర మత్తు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. హైదరాబాద్ నుండి విజయవాడ వైపు వెళ్తున్న టిప్పర్ రోడ్డు మధ్య ఉండే డివైడర్ ను దాటి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఆరెంజ్ ట్రావెల్ ను ఢ కొనేంత వేగంతో వెళ్లడం అతివేగమే కారణమా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా రోడ్డు ప్రమాదం జరిగిన తీరు చూస్తే గాయాలతో బయటపడటంతో పెనుప్రమాదం తప్పినట్లైంది.స్థానిక సీఐ నేతి శ్రీనివాస్ పర్యవేక్షణలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చౌటుప్పల్ ఎస్సై యం.నాగిరెడ్డి తెలిపారు.