Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -సంస్థాన్‌నారాయణపురం
వినాయకుడిని నిమజ్జనం చేసేందుకు వచ్చి చెరువు నీటిలో మునిగి యువకుడు మతిచెందిన సంఘటన గురువారం మండలంలోని రాచకొండలో చోటు చేసుకుంది. ఎస్ఐ చందా సుధాకర్ రావు తెలిపిన వివరాల ప్రకారం... హైదారాబాద్‌లోని కర్మన్ ఘాట్‌లో ఉమేష్ గుప్తా కాలనికి చెందిన డీజే ఆపరేటర్ వంశీ (21) గురువారం తన స్నేహితులతో కలిసి వినాయకుని నిమజ్జనం చేసేందుకు రాచకొండ గుట్టలోని సరళ మైసమ్మ దేవాలయం పరిసర ప్రాంతం వద్ద ఉదయం ఏడు గంటల 45 నిమిషాలకు చేరుకున్నారు. నిమజ్జనం చేస్తూ ప్రమాదవశాత్తు చెరువులో మునిగి మతి చెందాడు. సమాచారం తెలుసుకున్న ఎస్సై సంఘటనా స్థలానికి చేరుకొని వంశీ శవాన్ని వెలికితీశారు. తల్లిదండ్రులకు సమాచారం అందజేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చౌటుప్పల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.