Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నేరేడుచర్ల:జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఐక్య ఉద్యమాలు నిర్మించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను గద్దె దింపుతామని సీపీఐ సూర్యాపేట జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం మండల కేంద్రంలో నిర్వహించిన మిత్రపక్షాల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం దేశ సంపదంతా అంబానీ, ఆదాని కుటుంబాలకు కట్టబెట్టేందుకు కంకణం కట్టుకుందన్నారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు చేస్తున్న ప్రయత్నంలో భాగంగానే మూడు వ్యవసాయ నల్ల చట్టాలు తెచ్చిందన్నారు. విద్యుత్ సవరణ బిల్లు ద్వారా రైతుల మోటార్లకు మీటర్లు బిగించే ప్రయత్నాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నెల 27న జరిగే భారత్ బంద్‌ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ధూళిపాల ధనంజయనాయుడు అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో టీడీపీ పట్టణాధ్యక్షులు పాల్వాయి రమేష్, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి సిరికొండ శ్రీను, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు నూకల సందీప్‌రెడ్డి, సీపీఐ మండల కార్యదర్శి రావుల సత్యం, మహిళా సమాఖ్య జిల్లా ఉపాధ్యక్షురాలు అయినాపురం లక్ష్మి, వైఎస్సార్టీపీ నాయకులు కర్రీ సతీష్‌రెడ్డి, టీడీపీ మండల అధ్యక్షుడు ఇంజమూరి వెంకటయ్య, సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి కొదమ గుండ్ల నగేష్, రాచకొండ అజరు, పొనుగోటి జంగారావు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు తాళ్ల రామకృష్ణారెడ్డి, టీడీపీ మండల కార్యదర్శి అరవింద రెడ్డి తదితరులు పాల్గొన్నారు.