Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ కథనానికి స్పందన
నవతెలంగాణ - పాకలవీడు
మండలంలోని కృష్ణా పరివాహక ప్రాంతమైన గుండెబోయిన గూడెం ప్రజలు ఇప్పటి వరకూ కరోనా టీకాలు వేయించుకోలేదు. ఇదే విషయాన్ని నవతెలంగాణ మినీలో కథనం ప్రచూరితమైంది. ఈ కథనానికి స్పందించిన అధికారులు ఆ గ్రామంలో గురువారం కరోనా వ్యాక్సిన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నేరేడు సైదులు, పంచాయతీ కార్యదర్శి శివకృష్ణ, ఏఎన్ఎం భూలక్ష్మి, ఆశా వర్కర్లు మద్దమ్మ తదితరులు పాల్గొన్నారు.