Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి
మిర్యాలగూడలో భారీ బైక్ ర్యాలీ
నవతెలంగాణ-మిర్యాలగూడ
73వ షెడ్యూల్డ్ ఎంప్లారుమెంట్లో కనీస వేతనాల జీవోలను వెంటనే సవరించాలని అక్టోబర్ 8న చేపట్టే రాష్ట్ర వ్యాప్త సమ్మె జయప్రదం చేయాలని సీఐటీయూ ఆధ్వర్యంలో గురువారం పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ స్థానిక హనుమాన్‌పేట ఫ్లైఓవర్ బ్రిడ్జి నుండి రాజీవ్ చౌక్ మీదుగా ఈదులగూడెం సుందరయ్య చౌరస్తా వరకూ సాగింది. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కోటి మందికి పైగా ఉన్న కార్మికులకు కనీస వేతనం అందడం లేదన్నారు. కనీస వేతనాల సాధన కోసం కార్మిక గర్జన పాదయాత్ర సాగుతుందని తెలిపారు. అక్టోబర్ 8న కోటి మంది కార్మికులు సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలన్నారు. అదే రోజున మండల కేంద్రాల్లో తహసీల్దార్, ఆర్డీవో కార్యాలయాలను ముట్టడించి స్తంభింపజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు డబ్బికార్ మల్లేష్, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు లక్ష్మీనారాయణ, జిల్లా కమిటీ సభ్యులు డాక్టర్ గౌతమ్ రెడ్డి, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు రవి నాయక్, నాయకులు రామచంద్రు, లింగమయ్య, ఎమ్‌డి.అంజద్, ఆయూబ్, ఇంద్రారెడ్డి, బావండ్ల పాండు, మంగారెడ్డి, పతాని శ్రీను, దేశీరాం నాయక్ పాల్గొన్నారు.
మాడ్గులపల్లి:రేపు జరిగే స్కీమ్ వర్కర్ల దేశ వ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి పిలుపునిచ్చారు. గురువారం మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశ వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీలు, ఆశా, మధ్యాహ్న భోజనం కార్మికులు, వీఆర్ఏ, వీవోఏలను పర్మినెంట్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేవంలో లక్ష్మీనారాయణ, రొండి శ్రీనివాస్, విష్ణు, యాదయ్య, గురువయ్య తదితరులు పాల్గొన్నారు.