Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కోదాడరూరల్
క్రీడా స్ఫూర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి అభినవ్ అని, ఆయన క్రీడాస్ఫూర్తిని పాఠ్యాంశంగా సిలబస్‌లో చేర్చేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. గురువారం పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాల, మేకల అభినవ్ స్టేడియంలో చెస్ చిచ్చర పిడుగు మేకల అభినవ్ 20వ వర్ధంతి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 20 ఏండ్ల క్రితం క్రీడా జగత్తులో ధ్రువ తారగా మెరిసిన అభినవ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని తెలిపారు. అభినవ్ స్ఫూర్తితో కోదాడకు చెందిన క్రీడాకారులు చెస్‌లో రాణించాలని కోరారు. అనంతరం సామాజిక కార్యకర్త బడుగుల నాగరాజు అది నా జీవిత చరిత్రపై రాసిన పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అభినవ్ తల్లిదండ్రులు మేకల వెంకటేశ్వర్లు, అరుణ, పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పప్పుల వీరబాబు, మున్సిపల్ చైర్ పర్సన్ వనపర్తి శిరీష లక్ష్మీనారాయణ, ఎంపీపీ చింతా కవిత రాధరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మెన్ జుట్టుకొండ సత్యనారాయణ, డాక్టర్ సుబ్బారావు, డాక్టర్ అశోక్‌కుమార్, ఎంఈవో సలీమ్, చెస్ క్రీడాకారులు కరుణాకర్‌రెడ్డి, పాండు రంగారావు, బొలిశెట్టి కష్ణయ్య, దొంగరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.