Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రవినాయక్, రాష్ట్ర నాయకులు అంజద్
నవతెలంగాణ-మిర్యాలగూడ
చెరువులను తలపిస్తున్న ప్రధాన రోడ్డును బాగుచేసి ప్రజల ఇబ్బందులు తీర్చాలని డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రవినాయక్, రాష్ట్ర నాయకులు ఎమ్‌డి.అంజద్ డిమాండ్ చేశారు. డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో మిర్యాలగూడ పట్టణంలో కోర్టు పక్కన ఉన్న రోడ్డు వద్ద నిరసన తెలిపి మాట్లాడారు. వర్షం వస్తే ప్రజలు నడవలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. కంటితుడుపు చర్యలు కాకుండా శాశ్వత పరిష్కారం ఉండే విధంగా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు పతాని శ్రీను, జిల్లా నాయకులు బాబునాయక్, నాగేందర్, పట్టణ వన్ టౌన్ అధ్యక్ష కార్యదర్శులు ఫారూఖ్, పల్లా భిక్షం, నాగేశ్వర్రావు, రాజు పాల్గొన్నారు.