Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆలేరుటౌన్: నల్లగొండ, రంగారెడ్డి పాల ఉత్పత్తి దారుల సహకార సహాయక సంఘం లిమిటెడ్ (మదర్ డైరీ) ఎన్నికల్లో భాగంగా శుక్రవారం నామినేషన్ల ఉపసంహరణ కార్యక్రమం నిర్వహించారు. అందులో భాగంగా ఆరు డైరెక్టర్ల ఎన్నికలు నామినేషన్ స్వీకరించగా వాటిలో ఇద్దరు మహిళలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు .యాదగిరిగుట్ట మండలం మహబూబ్ పేట గ్రామానికి చెందిన కందాల అలివేలు, చిట్యాల మండలం వనపాకల గ్రామానికి చెందిన కర్నాటి జయశ్రీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ,రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ ఉమ్మడి నల్గొండ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు చైర్మెన్ గొంగిడి మహేందర్ రెడ్డి వారిని సన్మానించారు.