Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ - చివ్వెంల
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, కార్మిక హక్కులను రక్షించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 27న తలపెట్టిన భారత్‌బంద్‌ను జయప్రదం చేయాలని మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు. ఐద్వా రాష్ట్ర మహాసభల సందర్భంగా శుక్రవారం సూర్యాపేటలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. నల్ల చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధాని ఢిల్లీలో పది నెలలుగా రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. కేంద్ర ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలతో దేశంలో 650 మందికి పైగా రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల గురించి పట్టించుకోని మోడీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులు బ్యాంకుల ద్వారా తీసుకున్న రుణాలు కట్టకున్నా వదిలేయడం ఎంత వరకూ సమంజసమని ప్రశ్నించారు. కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేసే పద్ధతుల్లో మోడీ విధానాలు ఉన్నాయని విమర్శించారు.