Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఐద్వా కేంద్ర కమిటీ సభ్యురాలు పుణ్యవతి
నవతెలంగాణ - చివ్వెంల, సూర్యాపేటరూరల్
తెలంగాణ రాష్ట్రంలో దొరల పాలన ఇక సాగదని, నాటి తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో కేసీఆర్ పాలనకు చరమగీతం పాడడం ఖాయమని ఐద్వా కేంద్ర కమిటీ సభ్యురాలు పుణ్యవతి అన్నారు. ఐద్వా రాష్ట్ర మహాసభల సందర్భంగా సూర్యాపేటలో నిర్వహించిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. ఇండ్లు, స్థలాలు లేక పేదలు ఏడేండ్లుగా ఇబ్బంది పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. కేసీఆర్ ఏడేండ్ల పాలనలో ఏ ఒక్క పేద వానికీ ఇల్లు కట్టించిన సందర్భం లేదన్నారు. ధరణి పేరుతో లక్షలాది ఎకరాల భూములు భూస్వాములకు కట్టబెట్టేందుకు కేసీఆర్ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని విమర్శించారు. సూర్యాపేట ప్రాంతంలో దొరలు, భూస్వాములకు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు జరిగాయని, ఆ ఉద్యమాల స్ఫూర్తితో ప్రభుత్వాలు అనుసరిస్తోన్న ప్రజా వ్యతిరేక విధానాలపై మరిన్ని ఉద్యమాలు నిర్వహిస్తామన్నారు.