Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తుంగతుర్తి
ఆర్యవైశ్యులు అన్ని రంగాల్లోనూ రాణించాలని ఆర్యవైశ్య సంఘం మండలాధ్యక్షులు ఈగ లక్ష్మయ్య కోరారు. శుక్రవారం మండల కేంద్రంలోని ధనలక్ష్మి ఫంక్షన్హాల్లో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడిగా ఎన్నికైన తాటికొండ సీతయ్యను సన్మానించి మాట్లాడారు. ఆర్యవైశ్యులను నేడు రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకుగా చూస్తున్నారే తప్ప వారికి వివిధ పదవుల్లో సముచిత స్థానం కల్పించడం లేదన్నారు. టీఆర్ఎస్ మండ లాధ్యక్షుడు తాటికొండ సీతయ్య మాట్లాడుతూ తాను 30 ఏండ్లు రాజకీయంలో ఉన్నానని, తనకు రాజకీయ జన్మనిచ్చింది భీంరెడ్డి నర్సింహారెడ్డి అని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బండారు దయాకర్, ఓరుగంటి సత్యనారాయణ, ఓరుగంటి అంతయ్య, గుమ్మడవెల్లి సోమయ్య, కేదారి, సోమయ్య, తల్లాడ శ్రీనివాస్, ఓరుగంటి సుభాష్, ఓరుగంటి శ్రీను, అశోక్, ఈగ నాగన్న పాల్గొన్నారు