Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-యాదాద్రి
కేంద్రంలో నరేంద్ర మోడీ నేతత్వంలోని బీజేపీ ప్రభుత్వం దేశాన్ని, దేశ సంపదను విదేశీ, స్వదేశీ కార్పొరేట్ శక్తులకు తాకట్టు పెడుతోందని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ విమర్శించారు. శుక్రవారం మండల పరిధిలోని చిన్న కందు కూరు గ్రామ శాఖ మహాసభ ఎర్ర ఐలయ్య అధ్యక్షతన నిర్వహి ంచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ నరేంద్రమోడీ, అమిత్షా ప్రభుత్వ సంస్థలను అంబానీకి, అదానికి అప్ప చెప్పు తున్నారని విమర్శించారు. రైతులకు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చి వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేయాలని కుట్రచేస్తున్నారన్నారు. రైతు వ్యతిరేక నల్ల చట్టాలను అమలు చేయబోమని కేరళ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానించిందని తెలిపారు. ప్రభుత్వం కూడా తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం మండల కార్యదర్శిగ బబ్బురి పోశెట్టి మాట్లాడుతూ వచ్చే నెల 3న యాదగిరిగుట్ట మండల ఏడవ మహాస పెద్ద కందుకూరు గ్రామంలో నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో శాఖ మహాసభల శాఖ కార్యదర్శి సుబ్బురు సత్యనారాయణ, దొడ్డి పెద్ద ఉప్పలయ్య, లోడె జహంగీర్, మేకల రవికుమార్, దొడ్డి చిన్న ఉప్పలయ్య పాల్గొన్నారు.