Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యాదాద్రి జిల్లా మార్కెటింగ్ అధికారి సబిత
మోత్కూరు:త్వరలో పత్తి కొనుగోళ్లు ప్రారంభిచనున్నందున మిల్లుల యజమానులు రైతులను ఇబ్బందులకు గురి చేయొద్దని యాదాద్రి జిల్లా మార్కెటింగ్ అధికారి సబిత సూచించారు. వ్యవసాయ మార్కెట్ పరిధిలో అనాజిపురం, దాచారం, దత్తప్ప గూడెం, పాలడుగు, కాటేపల్లిలోని పత్తి మిల్లులను శుక్రవారం ఆమె సందర్శించి మాట్లాడారు. మార్కెట్ పరిధిలో ఆరు పత్తి మిల్లులు ఉన్నాయన్నారు. సీసీఐ కొనుగోలు సెంటర్లు ప్రారంభించే నాటికి మిల్లులను అన్ని విధాలుగా సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. మిల్లుల్లో తూకాల్లో అవకతవకలు జరగకుండా వే బ్రిడ్జిల స్టాంపింగ్ పూర్తి చేయించారా, లైసెన్స్ లను రెన్యూవల్ చేసుకున్నారా లేదా అన్నది పరిశీలించారు. తూకాల్లో ఎలాంటి మోసాలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆమె వెంట వ్యవసాయ మార్కెట్ చైర్మెన్ కొణతం యాకూబ్ రెడ్డి, కార్యదర్శి ఎదుళ్ల వెంకటేశ్వర్‌రెడ్డి ఉన్నారు.