Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీపీఐ(ఎం) నల్లగొండం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి
మాడ్గులపల్లి : దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, విద్యుత్ చట్టాల సవరణను ఆపాలని, పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని, నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 27న నిర్వహించనున్న దేశవ్యాప్త బంద్‌ను జయప్రదం చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు.శుక్రవారం మండలకేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.దేశ వ్యాప్తంగా కేంద్రం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా నిర్వహించనున్న బంద్‌లో మండలంలోని రైతులు, కార్మికులు, ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.ఈ సమావేశంలో పార్టీ మండల కార్యదర్శి రొండి శ్రీనివాస్, సహాయకార్యదర్శి శ్రీకర్, అశోక్‌రెడ్డి, మల్లారెడ్డి, పవన్, నవీన్ పాల్గొన్నారు.