Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీపీఐ(ఎం) యాదాద్రి జిల్లా కార్యదర్శి జహంగీర్
నవతెలంగాణ-చౌటుప్పల్
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 27న తలపెట్టిన భారత్ బంద్‌ను విజయవంతం చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్ కోరారు. శుక్రవారం మండలకేంద్రంలోని కందాల రంగారెడ్డి స్మారక భవనంలో ఆ పార్టీ మండలకమిటీ సమావేశం రాగీరు కష్ణయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ నల్ల చట్టాలు రద్దుచేయాలని, ప్రభుత్వరంగ సంస్థల ప్రయివేటీకరణ ఆపాలని డిమాండ్‌చేశారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరుస్తుందని విమర్శించారు. ఈ సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహా, జిల్లా కమిటీ సభ్యులు ఆనగంటి వెంకటేశం, రొడ్డ అంజయ్య, బూర్గు కష్ణారెడ్డి, మండలకార్యదర్శి గంగదేవి సైదులు, నాయకులు చీరిక సంజీవరెడ్డి, బొజ్జ బాలయ్య, పొట్ట శ్రీను, ఆదిమూలం నందీశ్వర్, మీసాల శ్రీను, చింతల సుదర్శన్, బోయ యాదయ్య, పి.నాగరాజురెడ్డి, పల్లె శివ, చెన్నబోయిన వెంకటేశం, కొండె శ్రీశైలం పాల్గొన్నారు.