Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
నవతెలంగాణ-చండూరు
వృత్తి కోసం గౌడలంతా ఐక్యంగా ఉండాలని, త్యాగగుణం కలిగిఉండాలని ఎక్సైజ్ శాఖా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు.శుక్రవారం గౌడ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీశ్రీశ్రీ సర్దార్‌సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడారు.కాళ్లు మొక్కి అయిన గౌడజాతిని కాపాడుకుందామన్నారు.అధికారికంగా పాపన్న జయంతి, వర్ధంతిని సాధించామన్నారు.పాపన్న చరిత్ర తెలియని, గౌడలు, ఇతర కులస్తులు ఉండరని తెలిపారు.అప్పట్లో 33 కులాలకు రారాజుగా ఉంటూ 33 ఏండ్లు జయించిన ఏకైక రాజు సర్వాయి పాపన్న అని కొనియాడారు.అప్పట్లో రెండు గ్లాసుల విధానం ఉండేదని, దానిని పాపన్న వ్యతిరేకిం చారన్నారు.దేవతలు సుర పానకం ఇప్పుడు కల్లు క్యాన్సర్ లాంటి రోగాలను నయం చేస్తుందని సైంటిఫిక్‌గా రుజువైందన్నారు.ఇక్కడి ప్రభుత్వం సర్వాయి పాపన్నను గుర్తించకపోయినా లండన్ దేశంలో ఆయన చిత్రపటాన్ని నిర్మించడం గొప్ప విశేషమన్నారు.నల్లగొండ నుండి హైదరాబాద్‌కు కల్లు తీసుకెళ్లేవారన్నారు.కల్లుకు విలువ ఉందని, దీంతో గౌడన్నలకు ఆత్మగౌరవం పెరిగిందన్నారు. తమ ప్రభుత్వం చెట్టుపన్నును రద్దు చేసి గౌడ కులస్తులను ఆదు కుంటు ందన్నారు.క్యాన్సర్‌ను నయం చేసే కల్లును ప్రతి ఒక్కరూ సేవించాలని విజ్ఞప్తి చేశారు.గౌడన్నలకు వైన్స్లలో రిజర్వేషన్ కల్పించిన సీఎం కేసీఆర్ నిర్ణయం చరిత్రలో గొప్పదన్నారు. వడ్డేపల్లి గోపాల్‌గౌడ్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బూరనర్సయ్యగౌడ్, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌గౌడ్, రాష్ట్ర అధ్యక్షులు పల్లె లక్ష్మణ్‌గౌడ్, వంగాల స్వామిగౌడ్, జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు పల్లె రవికుమార్, ఎంపీపీ పల్లె కల్యాణి, జెడ్పీటీసీ కర్నాటి వెంకటేశం, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పూర్ణ వెంకటేశ్వర్లు, భీమనపల్లి శేఖర్‌గౌడ్, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షులు డాక్టర్ శ్రీనివాసమూర్తి, ఎక్సైజ్ బీసీ కమిషనర్ అంజన్‌రావు, అసిస్టెంట్ కమిషనర్ శంభుప్రసాద్, ఎక్సైజ్ ఎస్పీ హిమశ్రీ, జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్, వెంకటేశ్వర్లు, ఆప్కారి సీఐ భానుచంద్రనాయక్, ఆప్కారి సిబ్బంది, గౌడ కులస్తులు,పెద్దలు పాల్గొన్నారు.