Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు
నవతెలంగాణ-చిట్యాల
ఎన్ని కష్టాలొచ్చినా కడవరకు ఎర్రజెండా వదలని కమ్యూనిస్టు నాయకులు లడే లింగయ్య అని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు అన్నారు.శుక్రవారం మండలంలోని ఆరెగూడెం గ్రామానికి చెందిన పార్టీ సీనియర్ నాయకులు లడే లింగయ్య(90) అనారోగ్యంతో మృతి చెందారు.కాగా సీతారాములుతో పాటు పార్టీ జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి లింగయ్య అంత్యక్రియలకు హాజరయ్యారు.మృతదేహంపై ఎర్రజెండా కప్పి పూలమాలలేసి జోహార్లర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరెగూడెంలో పార్టీకి పిల్లర్‌గా ఉన్న లింగయ్య కుటుంబమంతా కమ్యూనిస్టు కుటుంబంగా నికరంగా నిలబడిందని కొనియాడారు.ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు జిట్ట నగేష్, అవిశెట్టి శంకరయ్య, పామనుగుళ్ల అచ్చాలు, నారబోయిన శ్రీనివాసులు, శీలా రాజయ్య, అరూరి శ్రీను,ఐతరాజు నర్సింహ, కత్తులలింగస్వామి, లోడె విష్ణుమూర్తి, టీఆర్ఎస్ నాయకులు బెల్లిసత్తయ్య, టీడీపీ నాయకులు పిశాటి మాధవరెడ్డి పాల్గొన్నారు.