Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిందితులను కఠినంగా శిక్షించాలి
నల్లగొండ ఎంపీ నల్లమాద ఉత్తమ్‌కుమార్ రెడ్డి
నవతెలంగాణ -నల్గొండ
రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతుందని, ప్రతిగ్రామంలోనూ నిర్వహిస్తున్న బెల్టుషాపులను రద్దు చేయాలని వెంటనే రద్దు చేయాలని నల్లగొండ ఎంపీ నల్లమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం నల్గొండ మండలంలోని ముషంపల్లి గ్రామంలో హత్యకు గురైన మహిళా కుటుంబాన్ని ఆయన పరామర్శించి సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మద్యం మత్తులో మహిళపై లైంగికదాడి, హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నూతన రాష్ట్రంలో మహిళా సంస్కతి కాపాడబడతదని కలలుగన్నం గాని ఆరేండ్ల పసిపాపల నుండి అరువైఏండ్ల వృద్ధ మహిళల అఘాయిత్యాలు జరుగుతాయని ఏనాడుఊహించలేదన్నారు. రాష్ట్రంలో జరిగిన లైంగికదాడులను పరిపరిశీలిస్తే మధ్యం మత్తులోనే జరుగుతున్నాయనేది యదార్థమని తెలిపారు. ఇటీవల హైదరాబాద్‌లోని సింగరేణి కాలనీలో ఆరేండ్ల బాలిక చైత్ర సంఘటనకు కారణం గంజాయిని తేలిపోయిందన్నారు. ఇన్ని దుర్గటనలకు గంజాయి మద్యమేనని తేలినా ప్రభుత్వం ఎందుకు ఎక్సైజ్ అధికారులకు మద్యం అమ్మకాలను టార్గెట్ పెట్టి అందిస్తుందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మధ్యాన్ని నియంత్రించకుండా నిందితులను అరెస్ట్ చేసి చేతులు దులుపుకుంటామంటే అత్యాయత్నాలకు పరిష్కారం దొరుకుతదా అని ప్రశ్నించారు. గ్రామాల్లో జరుగుతున్న హత్యలకు,లైంగికదాడులకు ప్రధాన కారణం బెల్టు షాపులేనని మహిళలు గగ్గోలు పెడుతున్నా ప్రభుత్వం ఎందుకు అరికట్టడం లేదన్నారు. నిందితులు బెయిల్ పై వచ్చే లోపే చార్జీషీట్ దాఖాలు చేయాలని మంత్రి ఇచ్చిన మాటకు కట్టుబడి పాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి తన విలువను కాపాడుకోవాలన్నారు.ప్రభుత్వం నుంచి మంత్రి మహిళా కమిషన్ చైర్మెన్ హాజరై కూడా బాధిత కుటుంబానికి ఎలాంటి హామీ ఇవ్వలేదన్నారు. తక్షణమే బాదిత కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం మహిళ కుటుంబానికి రూ.లక్ష చెక్కును అందజేశారు .ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు దుబ్బాక నర్సింహారెడ్డి , జెడ్పీటీసీ వంగూరు లక్ష్మయ్య ఎంపీపీ మనిమద్దె సుమన్, వైస్ ఎంపీపీ జిల్లెపల్లి పరమేశ్, తదితరులు పాల్గొన్నారు.