Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీపీఐ(ఎం)జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్
నవతెలంగాణ -యాదగిరిగుట్ట
యాదగిరిగుట్ట దేవస్థానం,పట్టణ అభివద్ధి మాస్టర్ ప్లాన్ పై ప్రభుత్వం, వైటీడీ అధికారులు స్పష్టతనివ్వాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జాహంగీర్ డిమాండ్ చేశారు. ఆదివారం యాదగిరిగుట్ట మున్సిపల్ శాఖ ప్రథమ మహాసభ ఎస్కే.లతీఫ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవస్థానం,పట్టణంఅభివద్ధిలో మాస్టర్ ప్లాన్ ఎన్నిసార్లు మారుస్తారు.. ఎక్కడెక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయో తెలపాలని డిమాండ్ చేశారు. గతంలోదేవస్థానం ఈవో భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించాలని కోరితే సౌకర్యాలూ కల్పించ లేమని వాల్ రైటింగ్ రాయడం దారుణమన్నారు. కొండ చుట్టూ రింగురోడ్డు పేరుతో ఎన్నో ఇండ్ల స్థలాలు లాక్కొని వారందరిని రోడ్డుపైన పడేశారని, వారికి సరైన పరిహారం లేకుండా సరైన హామీలు పరిష్కరించకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు.అసలు ఎక్కడ ఎక్కడ ఏ రోడ్లు నిర్మిస్తున్నారో ఎక్కడ ఇల్లు కోల్పోతారో తెలపకుండా సరైన విధానాలు లేకుండా ఇష్టారీతిన అభివద్ధి పేరుతో ప్రజలను అయోమయానికి గురి చేస్తుందన్నారు .ఇప్పటికైనా ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ పై క్లారిటీ ఇచ్చి వేలకోట్ల రూపాయల అభివద్ధి పై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమిటీ వేసి సమస్యలు పరిష్కరించాలని లేనిపక్షంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో భారీ ఎత్తున పోరాట కార్యక్ర మాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఆ పార్టీ మండల కార్యదర్శి బబ్బురి పోశెట్టి, పట్టణ కార్యదర్శి కానుగంటి నర్సింగ్ రావు, ఆవాజ్ జిల్లా అధ్యక్షులు ఎస్కే.లతీఫ్, పార్టీ పట్టణ కమిటీ సభ్యులు ఎస్కే షరీఫ్, కానుగంటి రామచందర్, ఆర్ నర్సయ్య, నల్ల మల్లయ్య, వి ఈశ్వర్ రెడ్డి, పేర బోయిన నర్సింహులు, బూడిద శ్రీహరి, పీఎస్ లింగం తదితరులు పాల్గొన్నారు.