Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భువనగిరి పార్లమెంటు సభ్యులు
కోమటిరెడ్డి వెంకటరెడ్డి
నవతెలంగాణ -ఆలేరుటౌన్
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు నైజాం రజాకార్లను గడగడలాడించిన చాకలి ఐలమ్మ స్పూర్తిగా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలపై పోరాటం చేస్తామని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో జిల్లా ప్రజా పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాల ముందు చాకలి ఐలమ్మ 126వ జయంతి పురస్కరించుకొని రాజీవ్ గాంధీ వాషర్ మెన్ కోపరేటివ్ సొసైటీ, రజక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ చాకలి ఐలమ్మ రజాకార్లతో రైతాంగ సాయుధ పోరాటం చేసి వందల ఎకరాలు పేదలకు పంచి పెట్టిన ఘనత ఆమెదని తెలిపారు . ఆమె పోరాట పటిమ నేటి తరానికి ఆదర్శమన్నారు. స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగడి సునీత మహేందర్ రెడ్డి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి రాకపోవడం బాధాకరమన్నారు. ఆలేరు మాజీ శాసనసభ్యులు జిల్లా జెడ్పీ ఫ్లోర్‌లీడర్ డాక్టర్ నోగేష్ ,టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి జనగాం ఉపేందర్‌రెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి బీర్ల అయిలయ్య , మున్సిపల్ చెర్మెన్ శంకరయ్య,ఎంపీపీ అశోక్, ఎంపీటీసీ ప్రశాంత్, ఆయా పార్టీల నాయకులు పుట్ట మల్లేష్ ,మంగ నర్సింహులు,చెక్క వెంకటేష్,బడుగు జాంగిర్, ఎజాజ్, వెంక ట్రజ్, వెంకటేష్,రజక సంఘం అధ్యక్షుడు అలేటి మల్లేష్, వర్కింగ్ ప్రెసడెంట్ ముదికొండ శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శులు ఆలేటి అనిల్, ముఖ్య సలహా దారులు మధుసూధన్, చెంద్ర శేఖర్, సత్యనారయణ, కిషన్, మైసయ, దశరథ,నరేందర్, నరసింహ, సత్తయ,తదితరులు పాల్గొన్నారు.