Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి
నవతెలంగాణ-భువనగిరిరూరల్
నేడు అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో జరిగే భారత్ బంద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి కోరారు. ఆదివారం పట్టణకేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు భారత్ బంద్ కార్యక్రమాన్ని తీసుకుందన్నారు. మూడు వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలని, విద్యుత్ బిల్లులు ఉపసంహరణ, కార్మిక హక్కులను కాలరాసే వెజ్ కోడ్ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సోమవారం ఉదయం 9 గంటల 30 నిమిషాలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతి పరులు, పార్టీ శ్రేయోభి లాశులు, పెద్ద ఎత్తున జిల్లా కేంద్రానికి తరలిరావాలని కోరారు.