Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మునిపంపుల అలుగు వద్ద బ్రిడ్జి నిర్మించాలి
సీపీఐ(ఎం) ,కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా
నవతెలంగాణ-రామన్నపేట
వర్షాలకు మునిపంపుల గ్రామ చెరువు అలుగు పోసి రోడ్డుపై ప్రవహిస్తుండడంతో రైతులు, ప్రజలు, ప్రయాణికులు, గీత కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి బొడ్డు పల్లి వెంకటేశం, కాంగ్రెస్ నాయకులు అయ్యాడపు నర్సిరెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని ముని పంపుల గ్రామ చెరువు కింద అలుగు వద్ద బ్రిడ్జి నిర్మించాలని డిమాండ్ చేస్తూ వరద నీటిలో నిలబడి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మునిపంపుల నుండి లక్ష్మాపురం వెళ్ళే దారిలో చెరువు కింద ఉన్న కల్వర్టు వర్షాలకు దెబ్బతిని కనీసం దాటలేని పరిస్థితి ఉందన్నారు. బ్రిడ్జి నిర్మించాలని కోరుతూ అధికారులకు, ప్రజాప్రతినిథులకు ఎన్ని సార్లు విన్నవించినా పట్టించు కోవడం లేదన్నారు. ఈ కార్యక్ర మంలో ఆ పార్టీ మండల కార్యదర్శివర్గ సభ్యులు యాదాసు యాదయ్య, శాఖ కార్యదర్శి తొలుపు నూరి శ్రీనివాస్, మాజీ సర్పంచ్ ఉయ్యాల లక్ష్మీనర్సు, యా దాసు దుర్గయ్య, ఎండి. మైనొద్దిన్, తాళ్ళపల్లి జితేందర్, చిత్తలూరి మల్లేశం, బూడిద భిక్షం, బాదె భిక్షం, తాళ్ళపల్లి దుర్గయ్య, కూనూరు శేఖర్, గంటెపాక శివ కుమార్, సత్తిరెడ్డి, నోముల రమేష్, భూడిద నర్సింహ్మ, మేడి ముకుంద, సిరిశాల యాదగిరి, మేకల జలెందర్ పాల్గొన్నారు.