Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మునుగోడు
మండలంలోని మునుగోడు పెద్ద చెరువు పెద్ద తూముద్వారా పారే గుండ్లోరిగూడెం పారుగంత నీటి కాల్వలో పూడికతీత పనులను ఆదివారం టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నారబోయిన రవి ముదిరాజ్ ప్రారంభించారు.ఈ సందర్భంగా నారబోయిన రవి మాట్లాడుతూ కాలువల పూడికతీత కోసం స్వచ్ఛందంగా ముందుకొచ్చిన రైతులను అభినందించారు. ఈ కార్యక్రమంలో మునుగోడు మాజీ సర్పంచ్ పాల్వాయి లక్ష్మీ చెన్నారెడ్డి ,ఈర్ల సత్తయ్య, జంగిలి నాగరాజు ,మిర్యాల శ్రీనివాస్,బొల్లం సైదులు,వార్డుసభ్యులు బొల్లం మారేష్,బొల్లం చిన్న అంజయ్య, బోల్లం మహేష్ ,బొల్లం సత్యనారాయణ,బొల్లం శ్రీశైలం పల్లె బోయిన రాజశేఖర్, రైతులు పాల్గొన్నారు.