Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బ్యాలెట్ పద్ధతిన అసోసియేషన్ ఎన్నికలు
నవతెలంగాణ-మిర్యాలగూడ
ఆసియాఖండంలో రైస్ ఇండిస్టీలో ద్వితీయ భాగం ఉన్న మిర్యాలగూడ రైస్‌మిల్ అసోసియేషన్ 2021-2023 సంవత్సరం నూతన కార్యవర్గాన్ని ఆదివారం స్థానిక మిల్లర్స్ అసోసియేషన్ భవనంలో ఎన్నుకున్నారు.కార్యవర్గం ప్రధాన పోస్టులకుగాను పోటీ నెలకొనడంతో బ్యాలెట్ పద్ధతిన ఎన్నికలు నిర్వహించారు.కార్యవర్గంలోని అధ్యక్ష,ఉపాధ్యక్ష, కార్యదర్శి, కార్యదర్శి -2, కోశాధికారి పోస్టులకుగాను నోటిఫికేషన్ విడుదల చేసి నామినేషన్లు స్వీకరించారు.అసోసియేషన్ పరిధిలో మొత్తం 82 ఓట్లు ఉన్నాయి.అధ్యక్ష పదవికి గౌరుశ్రీనివాస్, వజ్రపుఅపర్ణ పోటీపడగా గౌరు శ్రీనివాస్‌కు 76 ఓట్లు వజ్రపు అపర్ణకు ఆరు ఓట్లు వచ్చాయి.70 ఓట్ల ఆధిక్యతతో గౌరు శ్రీనివాస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.ఉపాధ్యక్షుని పదవికి రేపాల మధుసూదన్,గుడిపాటి శ్రీనివాసులు పోటీపడగా రేపాల మధుసూదన్‌కు 35 ఓట్లు,గుడిపాటి శ్రీనివాస్‌కు 47 ఓట్లు వచ్చాయి.12 ఓట్ల మెజార్టీతో గుడిపాటి శ్రీనివాస్ ఎన్నికయ్యారు.కార్యదర్శి 1 పోస్టుకు bష్ట్రశీస్త్రaఙaశ్రీశ్రీఱ వెంకటరమణ చౌదరి ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు.దీంతో ఆయన్ను ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించారు.కార్యదర్శి-2 పోస్టుకు రేపాల అంతయ్య, రంగ లింగయ్యలు పోటీ పడ్డారు.రేపాల అంతయ్యకు 36 ఓట్లు, రంగ లింగయ్యకు 46 ఓట్లు వచ్చాయి.10 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కోశాధికారి పదవికి పగిడిమర్రి సురేష్, ఎస్.వెంకటేశ్వర్లు పోటీపడగా పగిడిమర్రి సురేష్‌కు 66 ఓట్లు వెంకటేష్ 15 ఓట్లు వచ్చాయి.51 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఎన్నికల అధికారి గా పందిరి రవీందర్ వ్యవహరించగా మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కర్నాటి రమేష్,బండారు కుశలయ్య, మున్సిపల్ చైర్మెన్ తిరునగర భార్గవ్ పర్యవేక్షణలో ఎన్నికలు నిర్వహించారు.
కార్యవర్గ సభ్యులుగా పదిమంది ఎన్నిక..
మిల్లర్స్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులను లాటరీ పద్ధతిన ఎన్నుకున్నారు.మొత్తం 10 మంది సభ్యులకు అవకాశం ఉండగా 31 మంది కార్యవర్గ సభ్యులకు నామినేషన్ దాఖలు చేశారు.ఇందులో ఇద్దరు నామినేషన్ ఉపసంహరించుకోగా మిగిలిన 29 మంది పోటీ పడ్డారు. పోటీ ఎక్కువగా ఉండడం వల్ల లాటరీ పద్ధతిని ఎంచుకున్నారు.పోటీపడ్డ అభ్యర్థుల జాబితాలో క్రమ సంఖ్య ఆధారంగా చీటీలు వేసి నూతన కార్యవర్గం చేత చీటీలను ఎంచుకున్నారు.గుర్రం వెంకటరత్నం ,చలంచర్ల వెంకటేశ్వర్లు, నూతన్కి, వాసు, గార్లపాటి మట్టపల్లి, శ్రీరంగం నర్సయ్య,వెంకటకాశీనాథ్, గట్టు బాలరాజు, ముత్యాల రమేష్, గంధ సంతోష్, నూకల హనుమంత్రెడ్డిలు ఎన్నికైనట్టు ప్రకటించారు.
మిల్లర్ సమస్యల పరిష్కారానికి కషి...
మిల్లర్ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కషి చేస్తానని నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు గౌరు శ్రీనివాస్ తెలిపారు.స్థానిక మిల్లర్స్ భవనంలో నూతన పాలకవర్గాన్ని సన్మానించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు అన్యాయం జరగకుండా మద్దతు ధర అందేలా చూస్తానన్నారు.వివిధ సమస్యలను ప్రభుత్వం దష్టికి తీసుకెళ్ళి పరిష్కారానికి పాటుపడుతానన్నారు. అందరితో సమన్వయ పరుచుకుని సమస్యలను పరిష్కరిస్తామన్నారు.నూతన కార్యవర్గాన్ని మిల్లర్స్ సభ్యులు అభినందించారు.