Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టీడబ్య్లూజేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బసవపున్నయ్య
నవతెలంగాణ-చివ్వెంల
రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి బసవపున్నయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.జిల్లా కేంద్రంలోని బాలాజీగ్రాండ్ హోటల్ నిర్వహించిన ఆ సంఘం జిల్లా రెండో మహాసభలో ఆయన మాట్లాడారు.తూరాష్ట్రం ఏర్పడి ఏడేండ్లవుతున్నా ఇప్పటివరకు సమస్యలు పరిస్కారం కాలేదని విమర్శించారు.సీఎం కేసీఆర్ హామీ ఇచ్చిన విధంగా అర్హులైన జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలివ్వాలని డిమాండ్ చేశారు.కరోనాతో మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని,హెల్త్‌కార్డులు అన్ని కార్పొరేట్ ఆస్పత్రుల్లో చెల్లుబాటయ్యేవిధంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరారు.రాష్ట్రంలోని జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడం కేవలం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్‌కే సాధ్యమన్నారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఏడాదిన్నర వరకు కొత్త అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వకుండా రెన్యూవల్ చేస్తున్న ప్రభుత్వ నిర్ణయం సరైనది కాదన్నారు.హైదరాబాద్ సమాచార భవన్ ముందు 100 మంది జర్నలిస్టులతో నిర్వహించిన ధర్నా ఫలితంగానే స్పందించిన ప్రభుత్వం కొత్త అక్రిడిటేషన్ కార్డులిచ్చిందన్నారు.ఈ ఘనత కేవలం టీడబ్ల్యూజేఎఫ్ కే దక్కిందని చెప్పారు.కరోనా బారిన పడిన 400 మంది పాత్రికేయులకు మీడియా అకాడమీ నుండి ఆర్థికసాయం అందించింద న్నారు.ఇంకా చాలా మంది అప్లికేషన్లు పెండింగ్‌లో ఉన్నాయని, వాళ్లకు కూడా కరోనా సహాయాన్ని చెల్లించాలని కోరారు.సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రమణను కలిసి సొంతిండ్లు లేక జర్నలిస్టులు అద్దె ఇండ్లలో వుంటూ అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని వినతిపత్రం అందజేశామన్నారు. టీడబ్ల్యూజేఎఫ్ను ఇంకా బలోపేతం చేయాలని, ఆపదలో ఉన్న జర్నలిస్టులను ఆదుకోవడంలో మన యూనియన్ ముందంజలో వుంటుందన్నారు.అనంతరం రాష్ట్ర సెక్రెటరీ సలీమా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విలేకర్ల పట్ల వ్యవహరిస్తున్న తీరుతో వలస కూలీలకన్నా, ఉపాధి హామీ కూలీలకన్నా హీనంగా వారి జీవితాలు తయారయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.
టీడబ్య్లూజేఎఫ్ జిల్లా కమిటీ ఏకగ్రీవం
టీడబ్య్లూజేఎఫ్ జిల్లా అధ్యక్షకార్యదర్శులుగా రెండోసారి ఏకగ్రీవంగా ఐతబోయిన రాంబాబుగౌడ్,పాల్వాయి జానయ్య ఎన్నికయ్యారు. జిల్లాకేంద్రంలోని బాలాజీగ్రాండ్ హోటల్లో జరిగిన 2వ జిల్లా మహాసభల్లో జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా బుక్క రాంబాబు,నాయిని శ్రీనివాసరావు ఎన్నికయ్యారు.జాతీయ కౌన్సిల్ సభ్యునిగా దామోదర్,కోశాధికారిగా పులిమామిడి మల్లేష్ ఎన్నికయ్యారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఐతబోయిన రాంబాబుగౌడ్,కార్యదర్శి పాల్వాయి జానయ్య,రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బుక్క రాంబాబు, నిసార్, నాయిని శ్రీనివాసరావు,నాయకులు దామోదర్, పులిమామిడి మల్లేష్, శ్యామ్, పుల్లయ్య,పాలవరపు శ్రీనివాస్,లింగాల సాయి,గట్టు అశోక్, శ్రీరాములు, కృష్ణమూర్తి, బత్తిని వెంకటేశ్వర్లు, బూర వెంకటేశ్వర్లు, ఎరుకల సైదులు, ఉపేందర్, సైదులు, శ్రీను, తండానాగేందర్, బొల్లికొండ సతీష్, కొంగలసతీష్ పాల్గొన్నారు.