Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోదాడరూరల్
రాజ్యాధికారంలో పెరిక కులస్తులు భాగస్వాములు కావాలని పెరిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మద్ద లింగయ్య, మున్సిపల్ మాజీ చైర్మెన్ జుట్టుకొండ సత్యనారాయణలు కోరారు.ఆదివారం పట్టణంలోని పెరిక హాస్టల్ భవన్లో నిర్వహించిన ఆ సంఘం జిల్లా సర్వసభ్య సమావేశంలో వారు ముఖ్యఅతిథులుగా పాల్గొని మాట్లాడారు.అనంతరం ఆ సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.జిల్లా అధ్యక్షునిగా పట్టణానికి చెందిన వనపర్తి లక్ష్మీనారాయణ, ప్రధానకార్యదర్శిగా సూర్యాపేటకు చెందిన సముద్రాల రాంబాబు, అసోసియేట్ అధ్యక్షులుగా దొంగరి వెంకటేశ్వర్లు, కోశాధికారిగా బత్తిని కష్ణమూర్తి, ఉపాధ్యక్షులుగా పాయీలి కోటేశ్వరరావు, రామినేని సత్యనారాయణ, కటకం లక్ష్మీనారాయణ, తదితర కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ కార్యక్రమంలో పెరిక హాస్టల్ అధ్యక్షులు బొలిశెట్టి కష్ణయ్య, పెరికసంఘం మాజీ జిల్లా అధ్యక్షులు అంగిరేకుల నాగార్జున, మాజీ ఎంపీపీ బొలిశెట్టి నాగేంద్రబాబు, సుంకరి అజరుకుమార్, దొంగరి వెంకటేశ్వర్లు, పుల్లూరి అచ్చయ్య, గన్న చంద్రశేఖర్, కొక్కు లక్ష్మీనారాయణ, జుట్టుకొండ బసవయ్య, స్థానిక కౌన్సిలర్లు పాల్గొన్నారు.