Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోదాడరూరల్
పట్టణంలోని ప్రభుత్వాస్పత్రిని రాష్ట్ర పరిశీలన బందసభ్యుడు డాక్టర్ అశోక్‌కుమార్ ఆదివారం సందర్శించారు.ఈ సందర్భంగా కార్యక్రమాల అమలుతీరుతెన్నులను సూపరింటెండెంట్ డాక్టర్ రజిని ద్వారా అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ జాతీj కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.ఈ కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ డాక్టర్ వెంకటేశ్వర్లు, జిల్లా మాతాశిశు కార్యక్రమ ప్రోగ్రాం అధికారి డాక్టర్ శ్యాంసుందర్, జిల్లా అసంక్రమిత వ్యాధుల ప్రోగ్రాం అధికారి కల్యాణ్‌చక్రవర్తి, ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ రజిని, జిల్లా ప్రోగ్రాం అధికారి ఉమామహేశ్వరి, కిరణ్, డాక్టర్ సూరజ్, స్టాఫ్‌నర్సులు, ఇతర ఆరోగ్యఅధికారులు పాల్గొన్నారు.