Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లయన్స్ క్లబ్ జిల్లా మాజీ గవర్నర్ దార కృష్ణారావు
నవతెలంగాణ-సూర్యాపేటరూరల్
సూర్యాపేటపరిధిలోని విద్యానగర్‌కాలనీలో లయన్స్ క్లబ్ జోన్ చైర్పర్సన్ గండూరి కపాకర్ ఆధ్వర్యంలో రీజినల్ చైర్పర్సన్ నూకలవెంకట్రెడ్డి అధ్యక్షతన,లయన్ మాజీ జిల్లా గవర్నర్ ధార కృష్ణారావు దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.నేషనల్ బెస్ట్ ఎక్సలెన్సీ ప్రెసిడెంట్ 2019-20 అవార్డ్‌ను సూర్యాపేట లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షుడు గండూరి కపాకర్కు, స్పూర్తిక్లబ్ మాజీ అధ్యక్షురాలు కేతిరెడ్డి పద్మకు అందజేశారు. అనంతరం డైమండ్ సెంటేనియల్ 2019-20 అవార్డ్ స్పూర్తి క్లబ్ మద్ది హైమావతి, కన్మంతరెడ్డి వనజకు ప్రదానం చేశారు.ధార కృష్ణారావు మాట్లాడుతూ 2019-20 సంవత్సరానికిగాను లయన్స్‌క్లబ్‌కు ఉత్తమసేవలందించి అవార్డులు తీసుకున్న వారికి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో రీజినల్ చైర్మెన్ నూకల వెంకట్‌రెడ్డి,జోన్ చైర్మెన్లు గండూరి కపాకర్, యామ రామూర్తి, రీజినల్ మాజీ చైర్మెన్ పటేల్ నర్సింహారెడ్డి,లయన్స్ ఐ హాస్పిటల్ చైర్మెన్ ఉప్పల సంపత్‌కుమార్,సెక్రెటరీ ఆంగోత్ భావ్‌సింగ్,ట్రెజరర్ మిర్యాలసుధాకర్, స్ఫూర్తి క్లబ్ ప్రెసిడెంట్ కోన అండాలు,మునుగోటి నిర్మల పాల్గొన్నారు.