Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చిన్నగూడూరు
2023 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం కాంగ్రెస్‌దేనని ఆ పార్టీ డోర్నకల్ ఇన్‌ఛార్జి రామచంద్రనాయక్ ధీమా వ్యక్తం చేశారు. మండలంలోని విస్సంపల్లి గ్రామంలో పార్టీ గద్దె జెండాను ఆదివారం ఆయన ఆవిష్కరించారు. డీసీసీ అధ్యక్షుడు భరత్‌చందర్‌రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి చేరిన కంచనపల్లి యాకయ్య, మొగలగాని రాజు, చాగంటి వెంకన్న, అశోక్, విస్సంపల్లి బాబు, చాగంటి ఎల్లయ్య, వీరస్వామి, జనార్ధన్, నాగయ్య, బాలకష్ణ, భిక్షం, ఉపేందర్, తదితరులకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రామచంద్రనాయక్ మాట్లాడారు. టీఆర్ఎస్ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ లను అమలు చేయలేదని విమర్శించారు. అర్హులకు పింఛ న్లు, రేషన్‌కార్డులు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అందలేదని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరుపేదలందరికీ రూ.10 లక్షలు ఇవ్వాలని, అర్హులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిం చాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కేసీఆర్, డోర్నకల్‌లో రెడ్యానాయక్‌ల కుటుంబ పాలన సాగుతోందని మండి పడ్డారు. మేథావులు మౌనం వీడాలని కోరారు. కార్యక్రమం లో పార్టీ మండల అధ్యక్షుడు రాంరెడ్డి, నాయకులు గుని గంటి కమలాకర్, బండి శ్రీనివాస్, రాఘవరెడ్డి, రాజేందర్ రెడ్డి, నగేష్, వెంకటేశ్వర్లు, బిక్కు నాయక్, సుధాకర్, కిరణ్, ఆదాం, జీవన్, మధు తదితరులు పాల్గొన్నారు.