Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సంస్థాన్ నారాయణపురం: మండల కేంద్రంలోని మేళ్లచెరువు నీటి అడ్డంగా నిర్మించిన కోట చెరువు కట్ట పాక్షికంగా ధ్వంసమైంది. స్థానిక రైతుల విజ్ఞాపన మేరకు సోమవారం ఎంపీపీ ఉమా ప్రేమ్ చందర్ రెడ్డి మరమ్మతు పనులను చేయించారు. పాక్షికంగా గండ్లు పడిన కట్టను జేసీబీసాయంతో మట్టి పోయించారు. ముందస్తు జాగ్రత్తగా పనులను చేపట్టడం పట్ల స్థానిక రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు బొడ్డుపల్లి గాలయ్య, చిలువేరు ముత్యాలు, స్థానిక రైతులు చిలువేరు సోమయ్య, చిలువేరు అంజయ్య,పాలకుల సతీష్, చిలువేరు నరసింహ, చిలువేరు కష్ణ, బొడ్డుపల్లి బిక్షమయ్య, జంగయ్య, చిలువేరు రాములు, సాలయ్య, జక్కి యాదిరెడ్డి చంద్రారెడ్డి పాల్గొన్నారు.