Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కోదాడరూరల్
పసికందు మృతదేహం లభ్యమైన సంఘటన సోమవారం కోదాడలోని పెద్ద చెరువు వద్ద చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం..పట్టణంలోని టీడీపీ కార్యాలయం వద్ద గల పెద్ద చెరువులో పసికందు మృతదేహం పడి ఉంది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పట్టణ ఎస్సై రాంబాబు పసికందు మృతదేహాన్ని పరిశీలించి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మృతదేహం ఏమైనా కొట్టుకొచ్చిందా..లేక ఎవరైనా చెరువులో కావాలనే వదిలి వెళ్లారా అని పలువురు చర్చించుకుంటున్నారు.