Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అధికారుల గైర్హాజర్
నవతెలంగాణ -సంస్థాన్‌నారాయణపురం
సోమవారం నిర్వహించాల్సిన చెక్‌పవర్ సభ్యుని ఎన్నిక పలు నాటకీయ పరిణామాల నడుమ వాయిదా పడింది. చెక్‌పవర్ సభ్యుని ఎన్నికకు కావాల్సినంత సంఖ్యలో వార్డుసభ్యులు ఉన్నప్పటికీ సంబంధిత అధికారులు సర్పంచ్ గైర్హాజరయ్యారు. పొద్దంతా గ్రామపంచాయతీలో నిరీక్షణ చేసిన వార్డు సభ్యులు నిరాశతో ఇంటిముఖం పట్టారు. సర్పంచ్‌కు సంబంధించిన వ్యక్తికి చెక్ పవర్ ఇచ్చేందుకు కొంతమంది ప్రజాప్రతినిధులు అధికారులతో నాటకీయ పరిణామాలు కొనసాగిస్తున్నట్టు ఆరోపించారు. సర్వేలు గ్రామపంచాయతీలో ఉప సర్పంచ్ చెక్కుల పై సంతకాలు చేయడం లేదంటూ వార్డు సభ్యుల తీర్మానం మేరకు ఉపసర్పంచ్ చెక్ పవర్ రద్దు చేసిన విషయం పాఠకులకు విదితమే. తిరిగి వార్డు సభ్యులు ఒకరికి చెక్ పవర్ సభ్యుని ఎన్నుకునేందుకు సోమవారం ఎంపీవో వార్డు సభ్యులకు రాతపూర్వకంగా సమాచారం అందజేశారు. సర్పంచ్ ఎన్నికల అధికారి ఎంపీవో హాజరు కాకపోవడంతో చెక్ పవర్ సభ్యుని ఎన్నిక నాటకీయ పరిణామాల మధ్య వాయిదా పడింది. వార్డు సభ్యులు ఉదయం నుంచి సాయంత్రం వరకు చూసి నిరాశతో ఇంటి ముఖం పట్టారు. సభ్యుని ఎన్నికకై 12 మంది వార్డు సభ్యులలో ఎనిమిది మంది సభ్యుల కోరం ఉన్న హాజరు కాకపోవడంపై సర్పంచ్ ఏకపక్ష పోకడతో వార్డు సభ్యులు అసహనం వ్యక్తం చేశారు.