Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి
జహంగీర్
కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు
కుంభం అనిల్ కుమార్ రెడ్డి
భారత్ బంద్ విజయవంతం
బైక్ ర్యాలీ నిర్వహించిన అఖిల పక్షం
నవతెలంగాణ -భువనగిరి రూరల్
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను విడనాడాలని సీపీఐ(ఎం)జిల్లా కార్యదర్శి ఎండి. జహంగీర్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రజావ్యతిరేక విధానాలను నిరసనగానే అఖిలపక్షం ఆధ్వర్యంలో భారత్ బంద్ నిర్వహించినట్టు తెలిపారు. సోమవారం జిల్లాకేంద్రంలో అఖిల పక్షాల ఆధ్వర్యంలో భారత్‌బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వాలు ప్రజలను పరిరక్షించాల్సిన బాధ్యతను మర్చిపోయి, ప్రజా సంపదను ప్రైవేటు వ్యక్తులకు దోచి పెడుతున్నాయని విమర్శించారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటు రంగంకు అప్పగించడం, వారికి అనుకూల విధానాలు తీసుకురావడం సరికాద న్నారు. రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలను తీసుకు రావడం, కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాయడం ఎంతవరకు సమంజసమ న్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం పని చేయాల్సిన ప్రభుత్వాలు కొందరి ప్రయోజ నాలు, స్వ ప్రయోజనాలు కోసమే పని చేస్తున్నాయని విమర్శించారు.
జిల్లా కేంద్రంలో సీపీఐ(ఎం) , సీపీఐ, కాంగ్రెస్, బీఎస్పీ, టీజేపీలతో పాటు వివిధ ప్రజా సంఘాలు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బంద్ నిర్వహిం చారు.అఖిలపక్షం నాయకులను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. అరెస్ట్ అయినవారిలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్, రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ , జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు , కల్లూరి మల్లేశం ,డీసీసీ అధ్యక్షులు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి,సీపీఐ(ఎం) జిల్లా కమిటి సభ్యులు దాసరి పాండు, దయ్యాల నర్సింహ, మాయ కష్ణ, నాయకులు వనం రాజు, రాసాల వెంకటేష్ , అన్నంపట్ల కష్ణ, పల్లెర్ల అంజయ్య, కొండ అశోక్, నరాల చంద్రయ్య, కొక్కొండ కష్ణ, వడ్డెబోయిన వెంకటేష్, ఓవల్దాసు అంజయ్య, దండు గిరిలు ఉన్నారు.