Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలి
అఖిలపక్ష నాయకుల డిమాండ్
సూర్యాపేటలో బంద్ సంపూర్ణం
నవతెలంగాణ - చివ్వేంల
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తోన్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటించేందుకు సంఘటిత ఉద్యమాలు నిర్వహించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్, సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి మండారి డేవిడ్‌కుమార్, తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షులు కుంట్ల ధర్మార్జున, సీపీఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, సీపీఐఎంఎల్ న్యూ డెమోక్రసీ చంద్రన్నవర్గం నాయకులు కొత్తపల్లి శివకుమార్ పిలుపునిచ్చారు. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, పెరుగుతున్న ధరలను అరికట్టాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన బంద్ సోమవారం సూర్యాపేటలో సంపూర్ణంగా జరిగింది. బంద్‌లో భాగంగా అఖిలపక్షం ఆధ్వర్యంలో స్థానిక బస్ డిపో ఎదుట బైఠాయించారు. జనగామ క్రాస్ రోడ్డులో రాస్తారోకో నిర్వహించారు. పట్టణంలో ర్యాలీ నిర్వహించి షాపులు, ప్రభుత్వ, ప్రయివేటు రంగాల సంస్థలను బంద్ చేయించారు. అనంతరం వారు మాట్లాడుతూ మోడీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అనుసరిస్తున్న విధానాలతో ప్రజలపై అనేక భారాలు మోపుతుందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను అక్రమంగా ప్రయివేటు, కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతూ దేశ సంపదను ధారదత్తం చేస్తున్నారని విమర్శించారు. దేశ వ్యవసాయ రంగాన్ని నాశనం చేసే విధంగా తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పది నెలలుగా ఢిల్లీలో ఉద్యమం చేస్తున్నా మోడీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం సరికాదన్నారు. ఇప్పటికే ప్రజలు పెరిగిన ధరలతో ఇబ్బందులు పడుతుంటే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచి వారిపై మరింత భారం వేయడం సరికాదన్నారు. శాంతియుతంగా బంద్ నిర్వహిస్తున్న అఖిలపక్ష పార్టీల నాయకులను అరెస్టు చేయడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ములకలపల్లి రాములు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి కొలిశెట్టి యాదగిరిరావు, సీపీఐ(ఎం) జిల్లా నాయకులు కోట గోపి, ఎల్గూరి గోవిందు, మట్టిపల్లి సైదులు, జై.నరసింహారావు, కాంగ్రెస్ పట్టణాధ్యక్షులు అంజద్‌అలీ, నాయకులు ఆలేటి మాణిక్యం, కొండపల్లి సాగర్ రెడ్డి, మడిపల్లి విక్రం, నెల్లుట్ల లింగుస్వామి నరేంద్ర నాయుడు,పందిరి వెంకన్న, పిడమర్తి మల్లయ్య రెబల్ శ్రీను, పీఎన్ఎం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఆనంద్, కట్ట నర్సింహా, సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు గంటా నాగయ్య, పోలెబోయిన కిరణ్, కారంగుల వెంకన్న, తెలంగాణ జన సమితి నాయకులు గట్ల రామశంకర్, సీపీఐ నాయకులు దొరిపల్లి శంకర్, సీఐటీయూ జిల్లా నాయకులు చెరుకు యాకలక్ష్మీ, మామిడి సుందరయ్య, సాయికుమార్, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు జంపాల స్వరాజ్యం, జీఎంపీఎస్ జిల్లా కార్యదర్శి వీరబోయిన రవి తదితరులు పాల్గొన్నారు.