Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ
రైతులకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన విద్యుత్ బిల్లులను వెంటనే రద్దు చేయాలని టీఈఈ1104 ప్రాంతీయ కార్యదర్శి ఎన్ వెంకటయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ప్రజా వ్యతిరేక-ప్రభుత్వ రంగ సంస్థలలప్రవేటీికరణ విధానాలను నిరసిస్తూ జాతీయ కిసాన్మెర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన భారత్‌బంద్ సందర్భంగా ఆలిం డియా ఫెడరేషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ బిల్లులను వెంటనే రద్దు చేయాలని, కార్మికచట్టాలలో మార్పులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.లేకపోతే భవిష్యత్‌లో పెద్దఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో నాయకులు టి శ్రీనివాస్, డి. చంధ్రశేఖర్, ఎం సురేష్, పివి నాయక్, ఎంఏ పర్వేజ్, అయూబ్ పాషా, రాంబాబు, కోటీ, రామూర్తి, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.