Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముగ్గురి అరెస్టు
డీఐజీ రంగనాథ్
నవతెలంగాణ-నల్లగొండ
గంజాయి అక్రమరవాణాపై పటిష్ట నిఘా పెట్టడం ద్వారా జిల్లా పరిధిలో జాతీయ రహదారిపై 120 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు డీఐజీ ఏవీ.రంగనాథ్ తెలిపారు.సోమవారం అరెస్టుకు సంబంధించిన వివరాలను డీఐజీ రంగనాథ్ వెల్లడించారు.జిల్లా పరిధిలో ఉన్న జాతీయ రహదారి - 65పై నిరంతరాయంగా నిర్వహిస్తున్న వాహనాల తనిఖీలలో ఒక ఆర్టీసీ బస్సులో 20 కిలోలు, ఒక కారులో తరలిస్తున్న 100 కిలోల గంజాయి మొత్తం 120 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముఠా రూటు మార్చి ప్రైవేట్ వాహనాలలో కాకుండా ఆర్టీసీ బస్సులలో మహిళలతో కలిసి ప్రయాణికుల ముసుగులో గంజాయిని తరలిస్తున్నారు.తాజాగా జాతీయ రహదారిపై పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా భద్రాచలం డిపోకు చెందిన రాజధాని డీలక్స్ బస్సును కట్టంగూర్-నల్లగొండ క్రాస్ రోడ్డు వద్ద తనిఖీ నిర్వహించగా ఒరిస్సాకు చెందిన మహిళ సుమిత్ర సర్కార్, ఇద్దరు పురుషులు సుజిత్ బిస్వాస్, అమల్ పొద్దార్ భద్రాచలం మీదుగా 20 కిలోల గంజాయితో హైదరాబాద్‌కు తరలిస్తూ పట్టుబడ్డారు.ఈ కేసులో మరో ఇద్దరు వ్యక్తులకు సంబంధం ఉన్నట్టుగా విచారణలో తేలింది,వారిని త్వరలో అరెస్టు చేస్తాం.అదేవిధంగా మరో కేసులో 100 కిలోల గంజాయిని ఆంధ్రా -ఒరిస్సా సరిహద్దు నుండి మహారాష్ట్ర లాతూర్కు తరలిస్తుండగా జాతీయ రహదారి-65 పై వాహన తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో కట్టంగూర్ సమీపంలో పోలీసులు పట్టుకున్నారు.భద్రాచలం ప్రాంతానికి చెందిన ప్రభుభజన్ వద్ద గంజాయి కొనుగోలు చేసి హ్యుండయి ఐ-20 కారు (వీన 05 జవీ 2371) వాహనంలో భద్రాచలం నుండి నల్లగొండ జిల్లా మీదుగా హైదరాబాద్, అక్కడి నుండి మహారాష్ట్రలోని లాతూర్కు గంజాయి తీసుకెళ్తున్నారు.కారులో సులేమాన్ ఇలియాస్ సయ్యద్, మహబూబ్ దంగ్డేలు 100 కిలోల గంజాయితో పట్టుబడ్డారని, గంజాయితో పాటు ఐ-20 కారును పోలీసులు సీజ్ చేశారు.మహారాష్ట్రలోని లాతూర్ కు చెందిన ఇద్దరు మహిళలు అనసూయ వినాయక దూబే, పార్వతి నివర్తి జాదవ్, మరో ముగ్గురు పురుషులు దేవరాజ్ కామ్డే, సయ్యద్ హుస్సేన్ నాజర్, సోంనాధ్ దత్ జాదవ్ లకు ఈ కేసుతో సంబంధం ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు.రెండు కేసులలో నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి నేతృత్వంలో సమర్థవంతంగా పని చేసిన శాలిగౌరారం సీఐ పీఎన్డీ.ప్రసాద్, నకిరేకల్ సీఐ నాగరాజు, కట్టంగూర్ ఎస్సై శివప్రసాద్, పోలీసుసిబ్బందిని ఎస్పీ అభినందించారు.