Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ
ప్రజల ఆకాంక్షలను పరిగణనలోకి తీసుకోకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరంకుశ విధానాలను అవలంబిస్తున్నాయని అఖిలపక్ష నాయకులు ముదిరెడ్డిసుధాకర్రెడ్డి, నెల్లికంటి సత్యం, చెరుకు సుధాకర్, తండు సైదులుగౌడ్, గుమ్ముల మోహన్‌రెడ్డి అన్నారు.సోమవారం కేంద్రం తీసుకొచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా, కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేసే మోడి అనేక విధానాలను నిరసిస్తూ భారత్ బంద్ ను విజయవంతం చేయాలని అఖిల భారత రైతు పోరాట సమన్వయ కమిటీ 19 అఖిలపక్ష పార్టీలు ఇచ్చిన పిలుపు లో భాగంగా సోమవారం జిల్లా కేంద్రంలో సీపీఐ(ఎం), సీపీఐ, కాంగ్రెస్, తెలంగాణ ఇంటిపార్టీ, సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ, టీడీపీ, తెలంగాణ విద్యావంతుల వేదిక, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం, వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బస్సులు బయటకు రాకుండా నల్లగొండ బస్టాండ్ ఎదుట బైఠాయించారు.బస్సులను అడ్డుకునే సందర్భంలో పోలీసులకు, నాయకులకు మధ్య వాగ్వావాదం జరిగింది.అనంతరం సీపీఐ(ఎం)జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం, కాంగ్రెస్ నాయకులు గుమ్ముల మోహన్‌రెడ్డి, టీడీపీ నాయకులను పోలీసులు అరెస్టు చేసి టూటౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.బంద్‌ను అడ్డు కునేందుకు పోలీసులు నాయకులను ఎక్కడికక్కడే అరెస్టు చేసి పోలీస్స్టేషన్లకు తరలించారు.ఈ కార్యక్రమంలో సీపీఐఎం రాష్ట్ర నాయకులు తుమ్మల వీరారెడ్డి, కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున, ఐద్వా జిల్లా కార్యదర్శి పాలడుగు ప్రభావతి, తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షుడు పందుల సైదులు, సీపీఐఎం నాయకులు ఎండి సలీం, పుచ్చకాయల నర్సిరెడ్డి, దండెంపల్లి సత్తయ్య, కొండా అనురాధా, నలపరాజు సైదులు, సరోజ, భూతం అరుణకుమారి, ఉమారాణి, సీపీఐ జిల్లా నాయకులు శ్రవణ్‌కుమార్, పల్లా దేవేందర్‌రెడ్డి, ఏఐవైఎప్ జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్లు, ఏఐఎస్ఎప్ జిల్లా కార్యదర్శి బరిగెల వెంకటేష్, గాదెపాక రమేష్, సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు ఇందూరుసాగర్, బొమ్మిడి నగేష్, టీడీపీ నాయకులు ఎల్వీ.యాదవ్, బీఎస్పీ నాయకులు యాదగిరి, తెలంగాణ ఇంటిపార్టీ నాయకులు కొండేటి మురళి, జయచందన్, దినేష్ పాల్గొన్నారు.