Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వేములపల్లి
గుర్రం జాషువా జాతీయ సేవా పురస్కారాన్ని మండల వాసి వల్లంపట్ల అబ్రహం అందు కున్నారు. నవయుగ కవి చక్రవర్తి కవికోకిల గుర్రం జాషువా గారి 126 జయంతి ఉత్సవాలు శనివారం హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో హోప్ స్వచ్ఛంద సేవా సంస్థ, సింధు ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహిం చారు.ఈ సందర్భంగా మండలంలోని ఆమనగల్లు గ్రామానికి చెందిన సామాజిక సేవగాయకులు వల్లంపట్ల అబ్రహం గుర్రం జాషువా కళారత్న పురస్కారాన్ని అందుకున్నారు.కళ, విద్య, వైద్యం, పర్యావరణం, సామాజిక సేవలను గుర్తించి విశిష్ట సేవాపురస్కారం అందించారు.అనంతరం ప్రశంసాపత్రం అందజేసి సన్మానించారు.ఇటీవల సూర్యాపేటలో గాయకులు బాలసుబ్రమణ్యం ప్రథమ వర్ధంతి సందర్భంగా ఏర్పాటుచేసిన పాటల పోటీలలో ప్రథమ బహుమతి అందుకుని పలువురి అభినందనలు పొందారు.మండలవాసికి అరుదైన పురస్కారం లభించడం పట్ల పలువురు అభినందనలు తెలిపారు.