Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నాగార్జునసాగర్
నాగార్జునసాగర్ జలాశ యానికి వరద ప్రవాహం కొనసాగు తుండటంతో శ్రీశైలం జలాశయం నుండి 54,411 క్యూసెక్కుల వరద జలాశయానికి వచ్చి చేరుతుంది. దీంతో సాగర్ 2 క్రష్ట్ గేట్లను 5 అడుగులమేర ఎత్తి 16,096 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతానికి 589.50 అడుగుల వద్ద నీరు నిల్వ ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వసామర్ధ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 310.5510 టిఎంసిలు గా ఉంది. ప్రధాన జల విద్యుత్ కేంద్రం విద్యుత్ ఉత్పత్తి చేపడుతూ 28,217 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.ఎస్.ఎల్.బి.సి ద్వారా 1800 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు ఎలాంటి నీటివిడుదల లేదు,కుడికాల్వ ద్వారా 8298 క్యూసెక్కుల నీటిని ,మొత్తం 54,411 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.